ఏమో, మళ్లీ ఇంటర్నేషనల్‌ లెవల్‌లో ఆడతానేమో..! కీలక హింట్ ఇచ్చిన సఫారీ మాజీ సారథి-Namasthe Telangana

Faf Du Plessis: కెరీర్‌ చరమాంకంలో ఉన్న క్రికెటర్లతో పాటు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించినవాళ్లు కూడా తిరిగివచ్చి ఆఖరిసారిగా ఇంటర్నేషనల్‌ లెవల్‌లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ సారథి, వెటరన్‌ ఆటగాడు ఫాఫ్‌ డుప్లెసిస్‌ కూడా చేరాడు.


Faf Du Plessis: ఏమో, మళ్లీ ఇంటర్నేషనల్‌ లెవల్‌లో ఆడతానేమో..! కీలక హింట్ ఇచ్చిన సఫారీ మాజీ సారథి

Faf Du Plessis: వచ్చే ఏడాది వెస్టిండీస్‌, అమెరికా వేదికగా జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్‌ కప్‌లో ఆడేందుకు అంతర్జాతీయ స్థాయిలో పలవురు క్రికెటర్లు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కెరీర్‌ చరమాంకంలో ఉన్న క్రికెటర్లతో పాటు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించినవాళ్లు కూడా తిరిగివచ్చి ఆఖరిసారిగా ఇంటర్నేషనల్‌ లెవల్‌లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ సారథి, వెటరన్‌ ఆటగాడు ఫాఫ్‌ డుప్లెసిస్‌ కూడా చేరాడు. 2024లో జరుగబోయే పొట్టి ప్రపంచకప్‌లో ఆడేందుకు తానూ ఎదురుచూస్తున్నాని అతడు తాజాగా హింట్‌ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం అబుదాబి వేదికగా జరుగుతున్న టీ10 లీగ్‌లో ఆడుతున్న డుప్లెసిస్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

డుప్లెసిస్‌ మాట్లాడుతూ… ‘నేను తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడతానని నమ్ముతున్నాను. గత కొన్నాళ్లుగా నేను కోచ్‌తో దీని గురించే చర్చిస్తున్నా. టీ20 వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో ఇతర లీగ్‌లతో బ్యాలెన్స్‌ చేసుకోవడం ముఖ్యం..’ అని అన్నాడు. డుప్లెసిస్‌ తన టీ20 మ్యాచ్‌ను చివరిసారిగా దక్షిణాఫ్రికా తరఫున 2020లో ఆడాడు. దక్షిణాఫ్రికా తరఫున తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 2021లో (పాకిస్తాన్‌తో టెస్టు) ఆడాడు.

 

2014, 2016 టీ20 ప్రపంచకప్‌లలో సఫారీ టీమ్‌ను నడిపించిన డుప్లెసిస్‌.. 2020 తర్వాత ఈ ఫార్మాట్‌లో ఆడలేదు. బోర్డుతో విభేదాలు, ఇతరత్రా కారణాలతో అతడు జాతీయ జట్టు నుంచి క్రమంగా దూరమయ్యాడు. లీగ్స్‌ల మీదే ఎక్కువగా దృష్టి పెట్టిన డుప్లెసిస్‌.. ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. 2023 సీజన్‌లో డుప్లెసిస్‌.. 14 మ్యాచ్‌లలోనే 730 పరుగులు సాధించాడు.

First appeared on www.ntnews.com

Leave a Comment

Scroll to Top