బీఆర్‌ఎస్‌ఎల్పీ లీడర్‌గా కేసీఆర్‌ ఏకగ్రీవ ఎన్నిక-Namasthe Telangana

KCR | బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష నేతగా (BRSLP leader) ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ (KCR) ఎన్నికయ్యారు. పార్టీ సీనియర్‌ నాయకులు కె.కేశవరావు  అధ్యక్షతన శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు.


KCR | బీఆర్‌ఎస్‌ఎల్పీ లీడర్‌గా కేసీఆర్‌ ఏకగ్రీవ ఎన్నిక

KCR | బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష నేతగా (BRSLP leader) ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ (KCR) ఎన్నికయ్యారు. పార్టీ సీనియర్‌ నాయకులు కె.కేశవరావు  అధ్యక్షతన శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి.. బీఆర్‌ఎస్‌ పార్టీ శాసనసభాపక్ష నేతగా పార్టీ అధినేత కేసీఆరే ఉండాలని ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్యేలు బలపరిచారు. బీఆర్‌ఎస్‌ఎల్పీ లీడర్‌గా పార్టీ అధినేత కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర మూడో అసెంబ్లీ మొదటి సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. సభలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు సమావేశమై పార్టీ విధివిధానాలు, అభ్యర్థుల ప్రవర్తనా నియమావళి, సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ ముందు ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి నివాళులు అర్పించి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు.

Also Read..

Ministers | ఆర్థిక మంత్రిగా భట్టి.. శ్రీధర్‌బాబుకు ఐటీ, పరిశ్రమలు

Free Bus Journey | బాబోయ్‌ ఉచిత బస్సులు.. పథకం అమలుతో కర్ణాటకలో కొత్త సమస్యలు

Tribal University | ములుగుకు మణిహారంలా గిరిజన వర్సిటీ.. పదేండ్లకు నెరవేరిన విభజన హామీ

First appeared on www.ntnews.com

Leave a Comment

Scroll to Top